దేవునిగూడెం అడవికి ఐరాస పర్యావరణ విభాగం ప్రశంసలు..

నిర్మల్‌  (CLiC2NEWS): ఒక‌ప్పుడు బంజరుభూమిగా మారిన ఆ ప్రాంతం.. ప్ర‌స్తుతం పచ్చదనంతో క‌నువిందు చేస్తోంది. గ‌తంలో దేవునిగూడెం ప్రాంతమంతా అడవితో ఉండేది.. కాల‌క్ర‌మంలో అది ఆక్రమణలపాలై బంజరుభూమైంది. మ‌ళ్లీ ఈ ప్రాంతాన్ని ప‌చ్చ‌ద‌నంతో నింపేయాల‌ని సంక‌ల్పించిన అట‌వీశాఖ‌.. స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, పోలీసులు, గ్రామ‌స్థుల స‌హ‌కారంతో నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ అటవీ డివిజన్‌ దేవునిగూడెంలో 160 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది.

మొదటి విడత హరితహారంలో భాగంగా అక్కడ ఏకంగా `ఒక రోజు లక్ష మొక్కల’ కార్యక్రమం చేపట్టారు. 2015 జులై 7న చేపట్టిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ పాల్గొని ఓ మొక్కను నాటారు. మొక్కల్ని పెంచే పనుల్లో గ్రామస్థులను భాగస్వామ్యం చేశారు.

దాంతో ప్ర‌స్తుతం ఇప్పుడు అక్కడ సహజసిద్ధ అడవి రూపుదిద్దుకుంది. దాంతో ఏకంగా ఐఖ్య‌రాజ్య స‌మితి పర్యావరణ విభాగం ప్రశంసలు అందుకుంది.

“పచ్చదనం పెంచడంలో ఇండియాలోని తెలంగాణ రాష్ట్రం వ‌ర‌ల్డ్ లీడ‌ర్‌గా ఉంది. ఆక్రమణలకు గురైన 160 ఎకరాల భూమిని కృషితో దట్టమైన అడవిగా అభివృద్ధి చేసిన ఖానాపూర్‌ అటవీ అధికారుల బృందానికి అభినందనలు“ అంటూ ఐఖ్యరాజ్య‌స‌మితి పర్యావరణ విభాగం మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(ఈడీ) ఎరిక్‌ సొల్‌హెమ్ ట్విట్ట‌ర్‌లో ఓ పోస్టు చేశారు.

toto slot

Leave A Reply

Your email address will not be published.