ఒమిక్రాన్‌కు భయపడకండి.. నిబంధనలు పాటించండి: ఢిల్లీ సిఎం
ఢిల్లీ(CLiC2NEWS): దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ వేరియంట్ కేసు నిర్థారణయిన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రజలు భయపడొద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని భౌతిక దూరం పాటించటం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కరోనా వేరియంట్‌ను కట్టడి చేయడానికి అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేయాలంటూ కేజ్రీవాల్ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. టాంజానియా నుండి ఢిల్లీ వచ్చిన వ్యక్తిలో కొత్త వేరియంట్ ఉన్నట్టు తేలిన విషయం తెలిసినదే.