తెలంగాణలో దసరా సెలవులు
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు దసరా సెలవులు ప్రకటించింది. పాఠశాలలకు సెప్టెంబర్ 21 వ తేదీ నుండి అక్టోబర్ 3వరకు సెలవులు ఇస్తున్నారు. అదేవిధంగా సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 5 వరకు జూనియర్ కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.