AP: ఈ నెల 22 నుండి విజయవాడ ఉత్సవ్!
సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2వ వరకు
అమరావతి (CLiC2NEWS): విజయవాడ దసరా నవరాత్రులు సందర్బంగా ఈ నెల 22వ తేదీ నుండి నగరంలో విజయవాడ ఉత్సవ్ పేరుతో 11 రోజులు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున వేడుకలు నిర్వహించనుంది. దీని కోసం సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2వ వరకు ప్రణాళికలు రూపొందించింది. నగరంలోని కృష్ణానది తీర ప్రాంతం, తుమ్మలపల్లి కళా క్షేత్రం, ఘంటసాల సంగీల కళాశాల, ఇందిరా గాంధీ మైదానం, గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లలో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ప్రముఖ సినీ , ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో సినీ, సంగీత, సాంస్కృతిక , క్రీడలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిధ్దమవుతున్నారు.
గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 12 సంవత్సరాల తరువాత ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు. వేదికపై ప్రతి రోజూ ఒక్కో సినీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయనున్నారు. ముందుగా సెప్టెంబర్ 22న ఒజి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. అనంతరం అఖండ, మన శంకరవర ప్రసాద్‌గారు సినిమా ప్రత్యేక పాటల విడుదల కార్యక్రమం ఉంటుంది.