మ‌హిళా సంఘాల‌కు శుభ‌వార్త‌

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ స‌ర్కార్.. రాష్ట్రంలోని మ‌హిళా సంఘాల‌కు శుభ‌వార్త తెలిపింది. మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క బృందాల కు ఇస్తున్న వ‌డ్డీలేని రుణాల‌ను రూ.5 ల‌క్ష‌ల నుండి రూ.10 ల‌క్ష‌ల‌కు పెంచింది. ఈ మేర‌కు మంత్రి సీత‌క్క తెలిపారు. అంతేకాక వీరు తీసుకునే రూ. 10ల‌క్ష‌ల బ్యాంకు రుణాల‌పై వ‌డ్డీ మొత్తాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. గురువారం మ‌హిళా సంఘాల‌కు ఇచ్చే బ్యాంకు వార్షిక రుణ ప్రాణాళిక‌ను ప్ర‌జాభ‌వ‌న్‌లో ఆవిష్క‌రించారు. 2025-26 ఆర్ధిక సంవ‌త్స‌రంలో ఎస్ హెచ్ జి స‌భ్యుల‌కు రూ. 25,228.89 కోట్ల బ్యాంకు రుణాలు ఇచ్చినట్లు మంత్రి వెల్ల‌డించారు. అంతేకాకుండా మ‌హిళా సంఘాల రుణాల వ‌డ్డీల కోసం రూ.2500 కోట్లు వ్య‌యం చేస్తామ‌ని తెలిపారు. కోటి మంది మ‌హిళ‌ల‌ను కోటీశ్వ‌రుల‌ను చేసే ప్ర‌య‌త్నంతోనే స‌ర్కార్ ప‌ని చేస్తోంద‌ని సీత‌క్క అన్నారు.

 

AP: ఆర్‌టిసి బ‌స్సు ఆప‌క‌పోవ‌డంపై ఎమ్ఎల్ఎ ఆగ్ర‌హం..

 

Leave A Reply

Your email address will not be published.