కీళ్ళ నొప్పి – వాతరక్తం – Gout..
మూత్రపిండాలు యూరిక్ ఆసిడ్స్ ని విసర్జించకపోవటము gout వ్యాధికి కారణం. వాతరక్తం శరీరంలోని ప్యూరిన్ మెటబాలిసంలో అస్తవ్యస్థత కలగటం వలన ఏర్పడే వ్యాధి కీళ్ళ వ్యాధి. ఈ మెటాబాలిజం లోపం వలన శరీరం నుండి ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్దాలలో ఒకటైన యూరిక్ ఆసిడ్ వల్ల పెరగటం వలన gout వస్తుంది. ఈ యూరిక్ ఆసిడ్ అధికంగా పెరిగినపుడు గడ్డలు అంటే స్పటికాలుగా మారుతుంది. ఇవి శరీరంలో వివిధ బాగాలలో ముఖ్యంగా మోకాళ్ళు, మోచేతులు, చేతులు కాళ్ళలోని మిగతా కీళ్లలో చేరుకుంటాయి. తీవ్రమైన యెడల స్పటికాలు, చెవులు, చేతులు, కాళ్లలో బుడిపేల రూపంలో కనపడతాయి. ప్యూరిన్ మెటబాలిజంలో తేడా ఎందుకు వస్తుందో కారణం మాత్రం పూర్తిగా తెలియదు. బహుశా జన్యు దోషం కావచ్చును అని కూడా అనుకోవచ్చును. అధికంగా ఆల్కహాల్ తాగటం. ప్యూరిన్ కలిగిన ఆహారపదార్దాలు మూత్రపిండాలు, గుండె, లివర్, మెదడు, కండరాలు, మాంసం, చేపలు, ఫిష్ రోస్ట్, స్వీట్ బ్రేడ్స్, సీఫుడ్స్, ఈస్ట్, కాలిఫ్లవర్, బఠాణిలు, మష్రూమ్స్, పెరుగు, ఇవన్నీ అహరములో తినటం మానివేయాలి.

వ్యాధి లక్షణాలు:
1. కాలిబోటను వ్రేలు వాపుకు లోనై ఎర్రగా ఉండి తీవ్రమైన మంట, మరియు నొప్పితో ఉంటుంది. దానిని ముట్టుకుంటే చాలు చచ్చి పోయే అంతగా నొప్పి, మంటగా ఉంటుంది. ఏందిరా బాబు ఈ కర్మ అనిపిస్తుంది. కండ్లలో నుండి ఏడ్పు వచ్చేస్తుంది
2. ఈ మంట మాములుగా ఉండదు, తేలు కుట్టినపుడు వున్న భాధ ఉంటుంది. ఈ మంట భరించలేనంతగా ఉంటుంది.
3. ఈ మంట, మరియు ఆకస్మాత్తుగా రావటం, మరియు రాత్రి పూట ఇంకా నొప్పిగా మంట ఎక్కువగా ఉంటుంది.
4. మంటతో పాటు, అధికంగా చెమట పోయటం, తిమ్మిరి, కాళ్ళు బాగా లాగటం ఉంటాయి.
5. ఉదయం లేవగాన కాళ్ళు మంచం నుండి కింద పెట్టగానే భయంకరమైన నొప్పి వస్తుంది. దానితో కాళ్ళు కింద కూడా పెట్టలేని పరిస్థితి.
6. వ్యాధి తీవ్రమైతే యూరిక్ ఆసిడ్ రక్తంలో నుండి తేలికగా వేరై క్రిష్టల్స్, బుడిపేల రూపంలో జాయింట్స్, లీగమెంట్స్,లోనే కాకుండా చెవి దగ్గర చిన్న చిన్న బుడిపేలుగా మారి ఇన్ఫ్లమేషన్ ను కలిగిస్తుంది.

ఈ వ్యాధికి పూర్తిగా చికిత్స లేదు. అయితే మందులు వాడినంత కాలం కంట్రోల్ లో ఉంటుంది. దీనిని నివారించటానికి నా వద్ద ఆయుర్వేద మందులు వున్నాయి. నా యొక్క సలహా మేరకు మందులు వాడితే యూరిక్ ఆసిడ్ ని తగ్గించవచ్చును.
దీనికి చక్కని ఆహారం తీసుకోవాలి
- విటమిన్ సి వున్న వాటిని ఎక్కువగా తీసుకోవాలి.
- చెర్రీ పండ్లు తినాలి
- మజ్జిగ బాగా తాగాలి.
- కొబ్బరిబోండా నీరు తాగాలి.
- నీటిని అధికంగా తాగితే మూత్రం ద్వారా బయటికి పోవటం జరుగుతుంది. కొవ్వు లేని పాలు తాగాలి.
- ఊసిరికాయ చూర్ణం ప్రతిరోజు ఒక టీ స్పూన్ తినాలి.
- తేనే, వేడి నీరు, నిమ్మరసం కలిపి తాగాలి.
దీని నివారణకు నా వద్ద జీర్ణ హరితకి అవ్వలేహ్యం వుంది దీనిని మూడు నెలలు వాడితే యూరిక్ ఆసిడ్ తగ్గటం, మాలమూత్ర విసర్చన చక్కగా జరిగి కీళ్ళ నొప్పులు తగ్గుతాయి