`10న జ‌రిగే లోక్ అదాలత్ ను స‌ద్వినియోగం చేసుకోండి..`

జైపూర్ (CLiC2NEWS): రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల జోన్లో గల జైపూరు సబ్ డివిజన్, చెన్నూరు  కోర్ట్ పరిధిలోగల పోలీస్స్టేషన్లు అనగా నీల్వాయి పోలీస్స్టేషన్, కోట పల్లి పోలీస్ స్టేషన్, చెన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్, భీమారం పోలీస్ స్టేషన్, జైపూర్ పోలీస్ స్టేషన్ గల కేసులను పరిష్కరించుకోవడానికి ఈ నెల 10వ తేదీన ఉదయం10 గంటల నుండి  చెన్నూరు మొదటి శ్రేణి  మేజిస్ట్రేట్ కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతున్నది.. కావున కేసులు పరిష్కరించుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలిసిందిగా పోలీసు శాఖ పేర్కొంది. ఈ మేర‌కు జి నరేందర్ ఏ. సి. పి. ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ఫిర్యాదుదారుడు, అభియోగం మోపబడిన వ్యక్తి కేసును పరిష్కరించుకునే అభిప్రాయము ఉన్నవారు సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్, కోర్టు కానిస్టేబుల్ ని సంప్రదించి మీ కేసును కోర్టు యందు  పరిష్కరించుకో గలరు అని ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

పోలీస్ స్టేషన్లో నమోదయి, చార్జిషీటు దాఖలుఐ, కాంప్ర మైజ్ కు వీలు గల సెక్షన్లు ఉన్న కేసులను, లాక్ డౌన్ సమయం లో విధించిన టువంటి ఇ- పెట్టి కేసులను పరిష్కరించుకో వలసిందిగా కోరారు.

Leave A Reply

Your email address will not be published.