Mancherial: కన్నెపల్లి బెల్ట్ షాపుల్లో టాస్క్ ఫోర్స్ దాడులు
బెల్లంపల్లి (CLiC2NEWS): కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం రేపట్నుంచి పది రోజుల పాటు లాక్డౌన్ను విధించిన సంగతి తెలిసిందే. రేపటి నుంచి లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించడంతో వైన్స్షాపులు అందుబాటులో ఉంటాయో.! లేదోనన్న సందేహంతో మందు బాబులు మద్యం దుకాణాలవైపు పరుగులు పెట్టారు. ఈ ప్రకటనతో మద్యం దుకాణాల వద్ద మందుబాబు క్యూ కట్టారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో వైన్స్ దుకాణాల ఎదుట మద్యం ప్రియులు బారులుదీరారు. కొన్ని మద్యం షాపుల వద్ద దాదాపు కిలోమీటరు మేర మందుబాబులు బారులు తీరడం గమనార్హం.
రాష్ట్రంలో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో మద్యం షాపులలో దందా జోరుతా సాగుతోంది. తాజాగా మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గం కన్నెపల్లి మండల కేంద్రంలో బెల్ట్ షాప్ లపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సుమారు 38 వేల రూపాయల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితులను తదుపరి విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్ లో అప్పగించారు.