ఐఎఎస్ అధికారిణి ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయిస్తూ ఉత్తర్వులు..
ఢిల్లీ (CLiC2NEWS): ఐఎఎస్ అధికారిణి కాటా ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో విధుల నిర్వహిస్తున్న ఆమెను రిలీవ్ చేసి ఎపి క్యాడర్ కు డిపార్ట్ మెంట్ ఆప్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డిఒపిటి) నాలుగు నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమె ఎపికి వెళ్లారు. అయితే డిఒపిటి ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ తనను తెలంగాణకు కేటాయించాలని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్లో) పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ అనుమతించిన క్యాట్ .. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఉమ్మడి రాష్ట్రంలోని ఐఎఎస్, ఐపిఎస్ అధికారులను 2014లో తెలంగాణ, ఎపి మధ్య విభజించారు. ఐఎస్ అధికారులు సోమేశ్ కుమార్, రొనాల్డ్ రోస్ వాణి ప్రసాద్, వాకాటి కరుణ, ఆమ్రపాలి , ప్రశాంతి లను ఎపికు కేటాయించారు.
అనంతరాము, ఎస్ెస్ రావత్, ఎల్. శివశంకర్, సి.హరి కిరణ్, సృజన గుమ్మిళ్లని తెలంగాణకు కేటాయించారు. పునర్విభజన యాక్ట్ ప్రకారం కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని డిఒపిటి ఆదేశించింది. ఈ ఆదేశాలన సవాల్ చేస్తూ కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి, సృజన క్యాట్లో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.