టెన్త్, ఇంటర్, డిప్లొమా అర్హతతో కోస్ట్ గార్డ్‌లో 630 పోస్టులు
కేంద్ర రాక్షణ శాఖకు చెందిన భారతీయ తీర రక్షక దళం నావిక్ , యాంత్రిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 630 పోస్టులు కలవు. ప్రతి ఏడాదికి రెండు సార్లు ఇండియన్ కోస్టు గార్డు ప్రకటనలు వెలువరిస్తుంది. ఈ పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులు. పది, ఇంటర్, డొప్లొమా విద్యార్హతలతో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, శరీరదారుడ్య, వైద్య పరీక్షలతో ఎంపిక జరుగుతుంది. స్టేజ్-1, స్టేజ్ -2 ద్వారా పరీక్షలు ఉంటాయి. ఎంపికైన వారికి శిక్షణ ఉంటుంది. అనంతరం ఆకర్షణీయమైన జీతంతో విధుల్లోకి తీసుకుంటారు. దరఖాస్తులను (25.06.2025) రేపు రాత్రి 11.30 గంటలకు వరకు స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుం రూ.300. ఎస్‌సి, ఎస్‌టిలకు ఫీజు లేదు.
నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టులు 50
వీటికి పదోతరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు.
నావిక్ జనరల్ డ్యూటి 520
ఈ పోస్టులకు మ్యాథ్స్ , ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులైన వారు అర్హులు
ఈరెండు పోస్టులకు ఎంపికైన వారికి లెవెల్-3 రూ.21,700 మూల వేతనంతో పాటు ప్రోత్సాహకాలు ఉంటాయి. మొత్తం నెలకు రూ.35 వేల వరకు జీతం ఉంటుంది.
యాంత్రిక్ పోస్టులు 60 ఉండగా.. మెకానికల్ 30, ఎలక్ట్రానిక్స్ 19, ఎలక్ట్రికల్ 11 ఖాళీలు ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు ఎలక్ట్రికల్ / మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ (రేడియో/ పవర్) విభాగాల్లో దేనిలోనైనా మూడేళ్ల డిప్లొమా కోర్సు ఉత్తీర్ణులైన వారు అర్హులు.
ఎంపికైన వారు మెదటి నెల నుండే రూ.50వేల వరకు వేతనం అందుకోవచ్చు.
ఈ పోస్టులన్నిటికీ 18 నుండి 22 ఏళ్ల వయస్సు ఉన్న వారు అర్హులు
పరీక్షలు సెప్టెంబర్ లో నిర్వహిస్తారు. తెలంగాణలో పరీక్ష కేంద్రాలు హైదరాబాద్ , నిజామాబాద్, వరంగల్లో ఉంటాయి. ఎపిలో విజయవాడ, విశాఖపట్టణం, గుంటూరు, తిరుపతి, కాకినాడలో ఉంటాయి.