కామారెడ్డి వాసుల‌కు గుడ్‌న్యూస్‌.. ప‌ట్ట‌ణంలోనే పాస్‌పోర్టు సేవ‌లు

కామారెడ్డి (CLiC2NEWS): ప‌ట్ట‌ణ వాసుల‌కు శుభ‌వార్త‌. ఇక నుండి పాస్‌పోర్టు సేవ‌ల‌ను  ప‌ట్ట‌ణంలోనే అందించ‌నున్నారు. పట్టణంలోని ప్రాంతీయ పోస్ట్ ఆఫీసు ఆవరణలో ప్రత్యేక వాహనంలో పాస్ పోర్టు సేవలను వినియోగదారులకు అందిస్తున్నారు. నిజామాబాద్ పట్టణంలో ఉన్న పాస్పోర్ట్ కార్యాలయమున‌కు వెళ్లే అవ‌స‌రం లేకుండా వినియోగదారులు వెళ్ళనవసరం లేకుండా ప్రస్తుతం కామారెడ్డి పట్టణంలోనే ఈ సేవ‌లు పొందే అవ‌కాశం క‌ల్పించారు. ఈ పాసుపోర్టు సేవలు ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 9 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండ‌నున్నాయి. ఇక్కడ నూతన పాస్ పోర్టులు, రెన్యువల్ సంబంధించిన పాస్పోర్టులు, ఇతర పాస్ పోర్ట్ సేవలు కూడా అందించ‌నున్నారు. ఈ మేర‌కు నిజామాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు అధికారి వెల్ల‌డించారు. ఈ అవకాశాన్ని కామారెడ్డి ప్రాంత ప్రజలు వినియోగించుకోగలరని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.