డ్రగ్స్ కేసులో నటుడు శ్రీరామ్ అరెస్ట్
చెన్నై (CLiC2NEWS): నటుడు శ్రీరామ్ ను చెన్నైపోలీసులు అరెస్టు చేశారు. రోజాపూలు, ఒకరికి ఒకరు సినిమాలలో నటించిన హీరో శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ తెలుగు వారికి సుపరిచితమే. నార్కొటిక్ పరీక్షల్లో పాజిటివ్ గా తేలడంతో ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం. అతను 40 సార్లు కొకైన్ కొన్నట్లు.. దాదాపు నాలుగున్నర లక్షల రూపాయల అనుమానాస్పద లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఎఐఎడిఎమ్‌కె ఐటి వింగ్ మాజి నేత ప్రసాద్ ను అరెస్టు చేసిన పోలీసులు అతని వద్ద నుండి సమాచారాన్ని రాబట్టారు. ఈ క్రమంలో డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. దీంతో శ్రీరామ్‌ను అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించగా.. శ్రీరామ్ డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణయ్యింది.