అద్వానీ పుట్టిన రోజు వేడుక‌ల్లో ప్ర‌ధాని మోడీ

న్యూఢిల్లీ (CLiC2NEWS): ఇవాళ (సోమ‌వారం) భార‌తీయ జ‌న‌తా పార్టీ సీనియ‌ర్ నేత ఎల్‌కే అద్వానీ 94వ పుట్టిన రోజు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు, ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు త‌దిత‌ర నేత‌లు అద్వానీ ఇంటికి వెళ్లి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా అద్వానీతో కేక్ క‌ట్ చేయించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు…

“గౌరవనీయులైన అద్వానీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిస్తున్నాను. ప్రజలను శక్తివంతం చేయడానికి.. మన సాంస్కృతిక గర్వాన్ని పెంపొందించడానికి ఆయన చేసిన అనేక ప్రయత్నాలకు దేశం అతనికి రుణపడి ఉంటుంది. అతను తన పాండిత్య కార్యకలాపాలు.. గొప్ప తెలివితేటలకు విస్తృతంగా గౌరవించబడ్డాడు.“
మోడీ త‌న ట్వీట్‌లో తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.