మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్‌ను పాడుచేసుకోవద్దు: ఏ సి పి ఎం రమేష్
గోదావరిఖని (CLiC2NEWS): విద్యార్థులు మత్తు పదార్ధాలకు బానిసలు కాకుండా చదువుపై దృష్టి సారించాలని, ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని గోదావరిఖని ఏసిపి ఎం రమేష్ సూచించారు. మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన వారోత్సవాల్లో భాగంగా Heal your mind & plant a tree- Say no to drugs అనే నినాదం తో గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్రెడ్ హార్ట్ స్కూల్లో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు గంజాయి మత్తుపదార్థాల నియంత్రణ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం, విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి గోదావరిఖని ఎసిపి ఎం రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులతో మాట్లాడుతూ…విద్యార్థి దశ నుండే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని లక్ష సాధన దిశగా అడుగులు వేయాలని, విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని, మత్తు పదార్థాలైన గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్ధాలు తీసుకుంటే భవిష్యత్తు అంధకారం అవుతుందని తెలిపారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలకు చేరుకుని తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తేవాలని సూచించారు. మీ కాలనీ, మీ చుట్టూ ప్రక్కల ప్రాంతం లో ఎక్కడైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతుందన్నారు. అనంతరం విద్యార్ధులతో కలిసి ఎసిపి, సీఐ, ఎస్సైలు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో గోదావరిఖని వన్టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి,ఎస్సై రమేష్, భూమేష్, పోలీస్ సిబ్బంది, టీచర్స్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
