‘ఉత్కృష్ట సేవా పతకం’.. పురస్కారానికి ఎంపికైన రామగుండం సిపి
రామగుండం (CLiC2NEWS): పోలీస్ శాఖలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు కేంద్ర ప్రభుత్వం అందజేసే ఉత్కృష్ట సేవా పతకానికి రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఎంపియ్యారు. ఈ పురస్కారం దేశంలోని పోలీసు, పారా మిలిటరీ, సాయుధ దళాలలోని అధికారులకు, సిబ్బందికి అందించే ఒక ప్రతిష్టాత్మక పురస్కారం. సేవలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అందజేస్తారు. 2009 ఐపిఎస్., బ్యాచ్ కి చెందిన అంబర్ కిషోర్.. వివిధ హోదాల్లో సుదీర్ఘకాలం వృత్తిపరమైన నైపుణ్యంతో విధులు నిర్వర్తించినందుకు గాను ఈ ఉత్కృష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు.ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా కి అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.