అర్హులైన ఎస్సీలకు ప్రభుత్వ లైసెన్సుల్లో రిజర్వేషన్లు : సిఎం కెసిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): దళితబంధు పథకం అమలుపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీల ఆర్థిక అవసరాలు, స్థితిగతులు పరిశీలిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. దళితబంధు పథకాన్ని రాష్ట్రం నలుదిక్కులా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. చింతకాని, తుంగతుర్తి, చారగొండ, నిజాంసాగర్ మండలాల్లో దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్రంలో నలుమూల్లోని నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలుపై అత్యున్నత స్థాయి సన్నాహక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..
“ప్రభుత్వం లైసెన్సులు కేటాయించే వివిధ రంగాలను గుర్తించి, అందులో అర్హులైన దళితులకు రిజర్వేషన్లు కల్పించనున్నట్లు సీఎం తెలిపారు. మెడికల్ షాపులు, ఫర్టిలైజర్ షాపులు, మీసేవా కేంద్రాలు, గ్యాస్ డీలర్ షిప్‌లు, ట్రాన్స్పోర్ట్ పర్మిట్స్, మైనింగ్ లీజులు, సివిల్ కాంట్రాక్టర్స్, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్, బార్, వైన్‌షాప్‌లు తదితర రంగాల ద్వారా ఉపాధి పొందే విధంగా, దళితబంధు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ‘అన్ని విధాలుగా దళిత కుటుంబం బాగుపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం’ అని సీఎం స్పష్టం చేశారు.
దళితుల కోసం చాలా పథకాలు పెట్టి, వారినే అభివృధ్ది చేస్తున్నారని సమాజంలో జరుగుతున్న చర్చ ఒక దుష్ప్రచారమేననని పేర్కొన్నారు. తెలంగాణ సర్కార్ ఏ ఒక్క వర్గాన్నీ విస్మరించడం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మొదటి దశలో పథకం అమలు పటిష్టంగా జరగాలని.. రెండో దశంలో పథకం పర్యవేక్షణ కీలకంగా ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్లు, దళిత బంధు కమిటీలు సమన్వయంతో పనిచేయాలని సిఎం సూచించారు. ఈ పథకం ద్వారా ఇచ్చే ఆర్థిక సాయం బ్యాంకు రుణం కాదనన్నారు సిఎం.
Wow, amazing blog layout! How long have you ever been running a blog for? you make running a blog look easy. The whole glance of your web site is fantastic, as smartly as the content material!!