మంచుచరియలు విరిగిపడి ఏడుగురు జవాన్లు మృతి
ఇటానగర్ (CLiC2NEWS): ఆరుణాచల్ ప్రదేశ్లో మంచుచరియలు విరిగిపడడం వలన సోమవారం ఏడుగురు జవాన్లు గల్లంతైనారు. కమెంగ్ సెక్టార్లోని ఎత్తయిన ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న జవాన్లపై మంచుచరియలు విరిగిపడ్డాయి. వారిని వెతికేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.