వీధి కుక్కల సమస్యను సుమోటొగా స్వీకరించిన సుప్రీంకోర్టు
ఢిల్లీ (CLiC2NEWS): దేశవ్యాప్తంగా ప్రజలు వీధి కుక్కుల సమస్యతో ఇబ్బందులకు గురవుతన్నారు. శునకాల బెడదపై మీడియాలో వచ్చిన కథనాలు దేశ సర్వోన్నత న్యాయ స్థానం దృష్టికి వచ్చాయి. దీనికి సుప్రీంకోర్టు స్పందిస్తూ ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. జస్టిస్ జెబి పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవ్‌తో కూడిన ధర్మాసనం వీధి కుక్కల బెడదను తీవ్రంగా కలవరపరిచే అంశంగా పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో వందలాది వీధి కుక్కల కాటు కేసులు నమోదవుతున్నాయి. కుక్క కాటుతో రేబిస్ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి సంబంధించి నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించింది.

దేశంలో ఎక్కడ చూసిన వీధి కుక్కల సమస్యతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. శునకాలు వీధుల్లో స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో చిన్నా , పెద్దా వీధుల్లో ఒంటరిగా వెళ్లాలంటేనే భయపడుతున్నారు. దేశవ్యాప్తంగా గతేడాది లో 37 లక్షల మంది కుక్కకాటుకు గురైనట్లు సమాచారం.