పొట్టి శ్రీరాములు వర్సిటీలో గురువుల‌ను సన్మానించిన విద్యార్థులు

హైద‌రాబాద్ (CLiC2NEWS): హైద‌రాబాద్‌లోని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ లో లో పద్యనాటక రంగం ద్వితీయ సంవత్సరం (డిప్లొమా) పూర్తిచేసుకున్న విద్యార్థులు. ఈ సంద‌ర్భంగా శ‌నివారం విద్యార్థులు వారి గురువులను ఘ‌నంగా స‌న్మానించారు. ఈ కార్యక్రమానికి పర్రీక్షనిర్వహకులుగా 50 నాటకాలు పైగా రాసిన రచయిత, నంది అవార్డ్ గ్రహీత దీపిక ప్రసాద్ , గురువులు నాగిరెడ్డి, వేణుగోపాల చారి, ప్రముఖ హార్మోనిస్ట్ (సంగీత కర్త) మల్లాది గోపాలకృష్ణ త‌దిరులు పాల్గొన్నారు.

అలాగే పద్య నాటకం డిప్లొమా పూర్తి చేసుకున్న వారిలో ప్ర‌భుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్ మేకల శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ కొండ శ్రీనివాస్ రావు, జర్నలిస్ట్ గోపాల్, సీనియర్ రంగస్థల నటులు కల్వకుర్తి ముత్యాలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.