హైదరాబాద్‌కు రానున్న మరో అంతర్జాతీయ సంస్థ: మంత్రి కెటిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో పలు అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసినదే . తాజాగా మరో అంతర్జాతీయ సంస్థ బాష్ (Bosch) రానున్నది. మొబిలిటి, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, గృహోపకరణాలలో ప్రపంచ అగ్రగామిగా ఉన్నది బాష్ సంస్థ. బాష్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం హైదరాబాద్‌ను ఎంచుకుందని పరిశ్రమల శాఖామంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ సంస్థ ద్వారా దాదాపు 3వేల మందికి ఉపాధి అవాకాశాలు లభిస్తాయని తెలిపారు.