Guntur: చెత్త తీసుకొచ్చి.. నిత్యావ‌స‌ర వ‌స్తువులు తీసుకోండి..

గుంటూరు (CLiC2NEWS): ఆంధ్రప్ర‌దేశ్‌లోని గుంటూరులో వినూత్న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. పొడి చెత్త‌ను సేక‌రించి.. దానికి బదులుగా నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను ఇస్తున్నారు. గ్రామాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచాల‌నే ఉద్దేశంతో రాష్ట్ర పంచాయ‌తీ రాజ్ శాఖ ఈ సరికొత్త కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. స్వ‌చ్ఛ‌ర‌థం పేరిట ఇంటింటికి వెళ్లి చెత్త‌ను సేక‌రిస్తుంది. ఒక వ్యానులో నిత్యావ‌స‌ర వ‌స్తువులు తీసుకొచ్చి వ్యార్థాల‌కు బుదులుగా ఇచ్చేలా రూపొందించారు. పొడి చెత్త‌లో ఉండే వ‌స్తువుల‌కు కిలోకి ధ‌ర‌లు నిర్ణ‌యించి రాసి పెట్టారు. అదేవిధంగా నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌కు సంబంధించిన ధ‌ర‌లు కూడా ఒక ప‌ట్టిక‌లో రాసిపెట్టారు. గ్రామ‌స్తులు వ్య‌ర్థాల‌ను ఇచ్చి దానికి త‌గినంత డ‌బ్బుతో నిత్యావ‌స‌ర వ‌స్తువులు తీసుకెళ్లాలా రూపొందించారు. దీనిని పైల‌ట్ ప్రాజెక్టుగా గుంటూరు జిల్లాలోని లాల్‌పురంలో ప్రారంభించారు.

 

Leave A Reply

Your email address will not be published.