TS Corona కొత్త‌గా 3,464 కేసులు

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్రవ్యాప్తంగా 65,997 కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు జ‌రుప‌గా 3,464 మందికి పాజిటివ్‌గా తేలింది. ఈ మేర‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ శుక్ర‌వారం సాయంత్రం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.

తాజా కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు పాజిటివ్ కేసుల సంఖ్య 5,47,727కు చేరింది. అలాగే కొత్త‌గా మ‌రో 25 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో కోవిడ్‌తో 3085 మంది ప్రాణాలు కోల్పోయారు. 4.801 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 5,00,247కు మంది కొవిడ్ బాధితులు కోలుకున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 44,395 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసుల్లో జీహెచ్ఎంసీ ప‌రిధిలో అత్య‌ధికంగా 534 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.