వైద్యో నారాయణో హరిః

ఓ అపర ధన్వంతరులారా

మీరే మా ప్రాణదాతలు

నిత్యం కనిపించే దేవతలు

మాకు జీవంపోసే బ్రహ్మలు

నవమాసాలు మోసే తల్లికి తల్లివై

కనుపాపలా కాపాడతారు

పసిపాపాల సంరక్షకుడవవుతారు

గుడ్డి వాడికి చూపిస్తారు రంగులప్రపంచం

కుంటివాడిని నడిపించి ఎక్కిస్తారు పర్వతశిఖరం

ప్రాణాలకే అడ్డు పెడతారు మీ ప్రాణాలు

ప్రతిరోజూ రోగులతోనే మీ సహవాసం

జీవులకోసం చేస్తారు సాహసం

ఎండలేదు, వానలేదు

ఆకలిదప్పులు లేవు

ఆరోగ్య సేవలోనే నిరంతరం

ధార పోస్తారు మీ జీవితం

ఓ త్యాగ మూర్తులారా మీకు ఏమివ్వగలం

చేతులెత్తి మొక్కుతాం

శిరసువంచి నమస్కరిస్తాం

-ఎస్.వి రమణా చారి
సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్
సెల్; 9849887086


Leave A Reply

Your email address will not be published.