`అనంతగిరి` ఆల‌యంలో ద‌ర్శ‌నాలు తాత్కాలికంగా నిలిపివేత‌

వికారాబాద్: దేశవ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ మ‌ధ్య‌కాలంలో కేసులు పెరుగుతుండ‌టంతో రాష్ట్రంలో వేముల‌వాడ స‌హా ప‌లు ముఖ్య‌మైన ఆల‌య‌ల్లో ద‌ర్శ‌‌నాలు ర‌ద్దు చేశారు. ఈ క్ర‌మంలో అనంత‌గిరిలోని అనంత‌ప‌ద్మ‌నాభ స్వామి దేవాల‌యంలో కూడా రేప‌టి నుండి ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేశారు. ఈ మేర‌కు ఆల‌య అధికారులు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.
“రాష్ట్రంలో కరోన కేసులు పెరుగు తున్నందువల్ల.. అలాగే దేవాలయం లో పని చేస్తున్న క్రింది స్థాయి సిబ్బందిలో ప‌లువురికి కరోన నిర్దారణ అయినందున స్వామి వారి దర్శనానికి రేపటి నుంచి తాత్కాలికంగా (7)రోజులు భక్తులకు అనుమతి నిలిపివేయడం జరిగింది. ఆలయపరిసరల్లో సానిటైజ్ చేయడం జరుగు తుంది.భక్తులు ఎవరు కూడా దర్శనానికిరావొద్దు. శ్రీరామ నవమి తేది 21.04.2021 రోజు అంతర్గతంగా స్వామి వారి కల్యాణం ఆలయ అర్చకులు నిర్వహిస్తారు. కావున భక్తులు ఎవరు కూడా రేపటి నుండి స్వామి వారి దర్శనానికి అనుమతి లేదని“అని ప్ర‌క‌ట‌న‌లో ఆలయ ఫౌండర్ సభ్యులు N.పద్మనాభం, ఆలయ E O G. శేఖర్ గౌడ్ పేర్కొన్నారు. భ‌క్తులు స‌హ‌కరించ‌గ‌ల‌రని కోరారు.

Leave A Reply

Your email address will not be published.