ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 117 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 117 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆదివారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. అలాగే వైరస్ నుండి కోలుకొని 66 మంది డిశ్చార్జి అయ్యారు. కాగా రాష్ట్రంలో తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు 8,89,916 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 8,82,029 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 718 మంది చికిత్స పొందుతున్నారు. కాగా ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌లో వరకు 7169 మంది కోవిడ్ తో మరణించారని అధికారులు పేర్కొన్నారు.