ఇస్రోతో దేశ ఖ్యాతి వర్ధిల్లుతున్నది : సీఎం కేసీఆర్
హైదరాబాద్ : ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) ద్వారా దేశ ఖ్యాతి మరింత వర్ధిల్లుతున్నదని తెలంగాణ సిఎం కె. చంద్రశేఖరరావు పేర్కొన్నారు. ఆదివారం పీఎస్ఎల్వీ-సీ 51 బ్రెజిల్‌కు చెందిన అమెజానియా-1తో సహా 18 స్వదేశీ ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడాన్ని కెసిఆర్ అభినందించారు. అంతరిక్ష పరిశోధనల్లో పలు దేశాలు సాయం కోసం ఇస్రోను ఆశ్రయిస్తున్నాయని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, సాంకేతిక సిబ్బందిని, ఉద్యోగులను అభినందించారు.