ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్తగా 116 కరోనా కేసులు

అమరావతి: ఎపిలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 116 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు ఆదివారం సాయంత్రం ఎపి వైద్యారోగ్య‌శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. కాగా వైరస్‌ బారినపడిన వారిలో 127 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 8,87,836 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 8,79,405 మంది చికిత్సకు కోలుకున్నారు. క‌రోనా మూలంగా ఇప్ప‌టి వ‌ర‌కు 7153 మంది మృత్యువాతపడ్డారని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Leave A Reply

Your email address will not be published.