ఎపిలో కొత్త‌గా 3,309 క‌రోనా కేసులు

అమ‌రావ‌తి: ఎపిలో క‌రోనా కేసులు ఏకంగా మూడు వేలు దాటాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో కొత్త‌గా 3,309 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో భారీగా కేసులు నమోదయ్యాయి.

ఈ మేర‌కు శ‌నివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 921906కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 1,053 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు 895949 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో 18666 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7291 మంది మృతి చెందార‌ని అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.