లోయలో పడిన ట్రక్కు.. 10 మంది మృతి
లఖ్‌నపూ: ఉత్తరప్రదేశ్‌లోని ఎటావాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎలావా జిల్లా పరిధిలో ఓ ట్రక్కు రోడ్డు పక్కన ఉన్న గుంటలో పడిపోవడంతో 10 మంది మృతి చెందారు. ఈ ఘటనలో 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో బాధితులందరూ పురుషులే.
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. జిల్లాలోని లఖ్నాలో జరిగిన మతపరమైన సమావేశానికి హాజరయ్యేందుకు ప్రయాణికులు వెళుతుండగా డ్రైవర్ ట్రక్‌పై నియంత్రణ కోల్పోవడంతో.. ట్రక్ 35 అడుగుల లోతు గుంటలో పడింది.

ఓపెన్ ట్రక్ నుండి ప్రయాణికులను పలువురు పైకి ఎగిరిపడినట్లు పోలీసులు తెలిపారు. మరికొందరు వాహనం కింద కూడా పడినట్లు తెలిపారు. ప్రమాదం తరువాత పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. పోలీసు అధికారులు కూడా సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు.