ఒకే దేశంలో వ్యాక్సిన్‌కు రెండు ధరలా?‌

హైదరాబాద్‌ (clic2news): వ‌చ్చే ఒక‌టో తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లకు పైబడిన వారికీ వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం అంగీకారించిన విష‌యం తెలిసిందే. కేంద్రానికి 50 శాతం వ్యాక్సిన్, రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేట్ ఆసుపత్రులకు కలిపి 50 శాతం వ్యాక్సిన్ లను ఉత్పత్తి దారులు అందించాల్సి ఉంటుంది.

ఈ వ్యాక్సిన్ ను వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు కేంద్రానికి రూ.150కి అందిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యాక్సిన్ ను రూ.400లకు అందించనున్నాయి. ఈ ధ‌ర‌ల తేడాపై
సర్వత్రా విమర్శలు ఎదురౌతున్నాయి.

ఈ క్ర‌మంలో కొవిడ్ వ్యాక్సిన్ల ధ‌ర‌ల వ్య‌త్యాసంపై మంత్రి కెటిఆర్ ఈ ఉద‌యం ట్వీట్ చేశారు. “ఒకే దేశంలో ఇప్పుడు వ్యాక్సిన్ల‌కు రెండు ధ‌ర‌లు చూస్తున్నాం. కేంద్రానికి రూ. 150. రాష్ట్రాల‌కు రూ.400 లకు టీకా అంటున్నారు. పిఎం కేర్స్ నిధి నుంచి అద‌న‌పు ఖ‌ర్చుని భ‌రించ‌లేదా? ఒకే దేశం ఒకే ప‌న్ను కోసం జిఎస్టిని అంగీక‌రించాం“ అని మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు..

Leave A Reply

Your email address will not be published.