DOST: ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ‘దోస్త్’ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిన సంగతి తెలిసిందే. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ కళాశాలల్లో సీట్ల భర్తీకి నిర్వహించే డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ ఉత్తీర్ణులైన వారు డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందేందుకు దోస్తులో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దోస్త్ ప్రక్రియ మూడు విడతల్లో ఉంటుంది. ఈ నెల 15వ తేదీ నుండి మొదలవుతుంది. జూన్ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తయ్యి జులై 1 నుండి తరగతులు ప్రారంభించనున్నారు. తొలి విడత రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200గా ఉంది. రెండు, మూడో విడతల్లో రిజిస్ట్రేషన్ ఫీజు రూ.400గా నిర్ణయించారు.
తొలి విడత
రిజిస్ట్రేషన్ : ఏప్రిల్ 15 పేండి మే 7 వరకు ఉంటుంది.
వెబ్ ఆప్షన్స్ : ఏప్రిల్ 30 నుండి మే 8 వరకు
సర్టిఫికేట్ వెరిఫికేషన్ : మే 7,8 తేదీల్లో
సీట్ల కేటాయింపు : మే 14
ఆన్‌లైన్ సెల్స్ రిపోర్టింగ్ : మే 15 నుండి 23 వరకు
రెండో విడత దోస్త్ ప్రక్రియ
రిజిస్ట్రేషన్ : మే 15 నుండి 25 వరకు ఉంటుంది.
వెబ్ ఆప్షన్స్ : మే 15 నుండి మే 26 వరకు
మే 26 నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్
మే 30న సీట్ల కేటాయింపు
ఆన్‌లైన్ సెల్స్ రిపోర్టింగ్ : మే 31 నుండి జూన్ 5 వరకు
మూడో విడత ప్రక్రియ
రిజిస్ట్రేషన్ : మే 31 నుండి జూన్ 15 వరకు ఉంటుంది.
వెబ్ ఆప్షన్స్ : మే 31 నుండి జూన్ 16 వరకు
జూన్ 16 న సర్టిఫికేట్ వెరిఫికేషన్
జూన్ 20న సీట్ల కేటాయింపు
ఆన్‌లైన్ సెల్స్ రిపోర్టింగ్ : జూన్ 20 నుండి జూన్ 25 వరకు