ఎల్లుండి తెలంగాణ ఇంటర్ ఫలితాలు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలను ఎల్లుండి విడుదల చేయాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయించారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రథమ, ద్వితీయ ఇంటర్ ఫలితాలను ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తొమ్మిది లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.