కోటి విలువైన బంగారం పట్టివేత
పంచలింగాల: కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద భారీగా బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ బుధవారం ఉదయం నిర్వహించిన తనిఖీల్లో రూ. 1.04 కోట్లు విలువైన బంగారం, వజ్రాభరణాలు పట్టుబడ్డాయి. ఈ భారీ విలువైన బంగారాన్ని హైదరాబాద్ నుంచి ముధరై తరలిస్తుండగా పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా ఒక ప్రయివేటు ట్రావెల్ బస్సులో తరలిస్తుండగా పోలీసులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. బంగారంతో పాటు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.