గీత కార్మిక సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా మూల మల్లేశం గౌడ్
పెద్దపల్లి (CLiC2NEWS): పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గౌడ సంఘం సమావేశంలో సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా మూల మల్లేశం గౌడ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి సింగం సత్తయ్య గౌడ్, రాష్ట్ర నాయకులు తాళ్ళపల్లి లింగయ్య గౌడ్,కోడూరు పరుశరామ్ గౌడ్, మండల అధ్యక్షుడు పాకాల రాజయ్య గౌడ్, ధర్మారం మండల గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.
