TS: కాంట్రాక్టు లెక్చరర్లకు జూన్ నుంచే పెరిగిన జీతాలు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు అధ్యాపకులకు కొత్త పీఆర్‌సీ ప్రకారం రెగ్యులర్ లెక్చరర్లతో పాటు సమానంగా జీతాలు చెల్లించనుంది. పెరిగిన వేతనాన్ని ప్రభుత్వం జూన్‌నెల నుండి చెల్లిస్తుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాలిబెక్నిక్, డిగ్రీ కళాశాలల్లో పనిచేసే దాదాపు 5 వేల మంది కాంట్రాక్టు అధ్యాపకులు ప్రయోజనం పొందుతారు.జూనియర్ కళాశాల అధ్యాపకులకు రూ.37,100 నుంచి రూ.54,220, డిగ్రీ, పాలిబెక్నిక్ అధ్యాపకులకు రూ.40,270 నుంచి రూ.58,850 వేతనం పెరిగింది.