చిరుతపులి సంచారం.. హడలిపోతున్న జనం
చొప్పదండి: కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి మండలం చిట్యాలపల్లిలో పులి సంచారం కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం ఎస్సారెస్పీ కెనాల్ సమీపంలోని ఓ రైతు తన పొలం వద్ద పెద్ద ఆకారంలో ఉన్న పాదముద్రలను గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. అధికారులు అక్కడికి గుర్తులను పరిశీలించి, చిరుతపులి సంచరిస్తున్నట్లు నిర్ధారించారు. ఆర్నకొండ శివారు, చిట్యాలపల్లి గ్రామాల్లోని వ్యవసాయ పొలాల్లో చిరుతపులి సంచరిస్తుందని వెల్లడించారు. కాబట్టి రైతులు ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లవద్దని చొప్పదండి అటవీశాఖ అధికారులు సూచించారు. అధికారుల పులి సంచారం వార్తను నిర్ధారించడంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.