తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 4446 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు శనివారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,331కి చేరింది. తాజాగా 1,414 మంది కరోనా బారి నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 3,11,008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనాతో కొత్తగా రాష్ట్రంలో 12 మంది మృతి చెందారు. తాజా మరణాలాతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మృతుల సంఖ్య 1809 కి చేరిందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 33,514 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల్లో అత్యధికంగా జిహెచ్ ఎంసి పరిధిలో 598 కేసులు నమోదు అయ్యాయి. ఆ తరువాత మేడ్చల్ మల్కాజిగిరి-435, రంగారెడ్డి-326, నిజామాబాద్-314, సంగారెడ్డి-235, వరంగల్ అర్బన్-136, సిద్ధిపేట-111, నిర్మల్-160, నల్లగొండ-168, మంచిర్యాల-121, మహబూబ్నగర్-139, ఖమ్మం-148, కరీంనగర్-149, కామారెడ్డి-184, జగిత్యాల-180 చొప్పున అత్యధికంగా ఈ జిల్లాల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి.