కరోనా: 2,34,692 కొత్త‌ కేసులు.. 1341 మరణాలు

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య తాండ‌వం చేస్తోంది. వ‌రుసుగా మూడో రోజు కూడా దేశంలో కొవిడ్ కేసులు రెండు ల‌క్ష‌ల‌కు పైనే న‌మోద‌య్యాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో కొత్తగా 2,34,692 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు శ‌నివారం కేంద్ర ఆరోగ్య‌మంత్రిత్వ శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,45,26,609కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 1,23,354 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 1,26,71,220 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 1341 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,75,649కి చేరింది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 11,99,37,641 మందికి వ్యాక్సిన్ ను అందించారు. ప్ర‌స్తుతం భార‌త్‌లో 16,79,740 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. దేశంలో రిక‌వ‌రీ రేటు 87.80 శాతంగా ఉంది.

మ‌హారాష్ట్ర, ఢిల్లీలో కేసుల సంఖ్య పెరుగుతోంది. మ‌హారాష్ట్రలో నిన్న ఒక్క‌రోజే 61,695 కేసులు న‌మోదు అయ్యాయి. 349 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఢిల్లీలో 16,699 కేసులు న‌మోదు అయ్యాయి. 112 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని అన్ని ఆసుప‌త్రుల‌లో కొవిడ్ కేసుల సంఖ్య‌, మ‌ర‌ణాల సంఖ్య పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో నిన్న ప్ర‌ధాని మోడీ ఆక్సిజ‌న్ ల‌భ్య‌త‌పై అధికారుల‌తో స‌మీక్ష జ‌రిపారు.

Leave A Reply

Your email address will not be published.