దెందులూరు టిడిపి అడ్డా కాదు.. వైసిసి గడ్డ: ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి
ఏలూరు: దెందులూరు తెలుగుదేశం పార్టీ అడ్డా కాదు.. వైఎస్సార్‌సీపీ గడ్డ అని దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. గెలిచిన వైసిపి సర్పంచ్ అభ్యర్థులతో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్టాడుతూ.. 14 ఏళ్ల పాటు సిఎంగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం సిగ్గుచేటని అన్ని అన్నారు. దెందులూరు నియోజకవర్గంలో 81 శాతం పైగా వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన దెందులూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి అడ్డా కాదని… ఈ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గడ్డ అని ప్రజలు పంచాయతి ఎన్నికల్లో మరొసారి నిరూపించారని స్పష్టం చేశారు. తన స్వగ్రామం కొండలరావు పాలెంలో వైసీపీ అభ్యర్థి 900 ఓట్ల మెజారిటీతో గెలిస్తే.. తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పింది నిజమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. అది అబద్ధమైతే చంద్రబాబు రాజీనామా చేస్తారా? అని సంచలన వ్యాఖ్యలు చేశారు.