యుపిలో రోడ్డు ప్ర‌మాదం.. ఏడుగురు మృతి

లక్నో:యుపిలో మంగళవారం అర్ధరాతి మధుర యమునా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై బోల్తాపడ్డ ట్యాంకర్‌ను ఇన్నోవా ఢీకొట్టిన‌ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మృతిచెందారు.. వివరాల్లోకి వెళితే.. ట్యాంకర్‌ నోయిడా నుంచి ఆగ్రా వైపు వెళ్తున్న క్రమంలో టైర్‌ పేలడంతో అదుపు తప్పి మరోమార్గంలో బోల్తాపడింది. మ‌రో వైపు ఆగ్రా నుంచి నోయిడా వెళ్తున్న ఇన్నోవా వేగంగా వచ్చి దాన్ని బోల్తాప‌డిన వాహ‌నాన్ని బ‌లంగా ఢీ కొన్న‌ది. ఈ ప్ర‌మాదంలో ఇన్నోవాలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడిక్కడే మృత్యువాతపడ్డారు. మృతులు హర్యానాలోని జింద్‌ వాసులని, మనోజ్ (45), అతని భార్య బబితా (40), కుమారులు అభయ్ (18), హేమంత్ (16), హిమాంగి (14), మను (10), డ్రైవర్ రాకేశ్ (39)గా గుర్తించారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌న‌స్థ‌లానికి చేరుకుని వాహ‌నంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను కట్టర్‌ను వినియోగించి బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.