దేశవ్యాప్తంగా నేడు వ్యాక్సిన్‌ డ్రైరన్‌

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా సన్నాహక వ్యాక్సినేషన్‌ ట్రయల్‌ రన్‌ (డ్రై రన్‌)ను కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం చేపట్టనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చేసిన ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను వైద్య శాఖ సీనియర్‌ అధికారులు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్‌కు వివరించారు. డ్రైరన్‌ను అసలైన వ్యాక్సినేషన్‌లాగా భావించాలని, ప్రతి నిమిషం క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరించి కొవిన్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని మంత్రి అన్నారు. 1994లో పల్స్‌ పోలియో డ్రైవ్‌ను విజయవంతం చేసినట్లుగానే ప్రజలు, ఎన్‌జిఒలు, ప్రజాసంఘాలు ఈ కార్యక్రమంలో కూడా భాగస్వామ్యులను చేయాలని హర్షవర్థన్‌ అధికారులకు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.