పసిడి ప్రియులకు షాక్: రూ.50 వేలకు చేరువలో..
హైదరాబాద్ (clic2news): పసిడి ప్రియులకు షాక్. ఈ మధ్యకాలంలో బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. వారం పదిరోజులుగా బంగారం ధరలు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు కిందికి కదలడంతో బులియన్ మార్కెట్‌లో ఈ ప్రభావం కనిపించింది. దాంతో బంగారం ధర గురువారం భారీగా పెరిగింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 770 పెరిగి రూ. 48,930 కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 700 పెరిగి రూ. 44,850 కు చేరింది. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధర రూ. 300 పెరిగి రూ. 73,900 వద్ద కొనసాగుతోంది.