బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్ష సూచన
చెన్నై: నైఋతి బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటలలో ఇది నైఋతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అనంతరం మరో 24 గంటలలో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడుకు తుఫాను పొంచి ఉండటంతో అక్కడి వారిని భారత మీటియోరోలోజికల్ డిపార్టిమెంట్ వారు ముందుగా హెచ్చరించారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడుకు భారీ తుఫాను పొంచి ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. అయితే ఈ తుఫాను కరైకల్, మల్లాపురాలను నవంబరు 25నాటికి దాటతాయని తెలిపారు. అత్యంత దారుణమైన తుఫాను వచ్చేందుకు అవకాశాలు భారీగా ఉన్నాయని, ఈ గాలులు వాయువ్యధిశ నుంచి పడమర దిశకు మరలాయని సమాచారం. ‘ఈ తుఫాను తీవ్రత అధికంగా ఉండనుంది. అరేబియన్ సముద్రంలోని వాయువ్య భాగం నుంచి గాలులు పడమటి దిశకు మరలాయి. ఈ అల్పపీడనం అరేబియన్ వాయువ్యభాగంలో దాదాపు 10.4 ఎన్ లాటిట్యూడ్ను, 51.5 ఈ గానమోదయింది. అంతేకాకుండా సమాలియా రేవుకు 40 కిలోమీటర్ల తూర్పుకు, 90 కిలోమీటర్ల వాయువ్యానికి ఉంది. రానున్న 12 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని, 24 గంటల్లో తుఫానుగా మరుతుందని ఐఎండీ తెలిపింది.