బైకును ఢీకొట్టిన డిసిఎం.. ఇద్దరి మృతి
వికారాబాద్: జిల్లాలోని పూడూరు మండలంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని చిన్నబండ తండా వద్ద ఓ బైక్ను డిసిఎం వాహనం ఢీకొట్టిన ఘటనలో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు బొంరాస్పేట మండలానికి చెందిన శివ, మల్కయ్యగా గుర్తించారు. ఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.