తెలంగాణలో కొత్తగా 3,840 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ గడిచిన 24 గంటల్లో 3,840 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు రాష్ట్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ఉద‌యం క‌రోనా బులిటెన్‌లో తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,41,885కు చేరింది. కొత్తగా 1,198 మంది బాధితులు వైరస్‌ నుంచి కొలుకొని ఇండ్లకు వెళ్లారు. ఇప్ప‌టి వ‌ర‌కు 3,09,594 మంది కోలుకున్నారు. తాజాగా వైరస్‌ బారినపడి మరో తొమ్మిది మరణించారని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,494 యాక్టివ్‌ కేసులున్నాయని బులిటెన్‌లో పేర్కొన్నారు.

కొత్తగా నమోదైన కేసులో అత్యధికంగా 505 జీహెచ్‌ఎంసీలో, మేడ్చల్‌లో 407, రంగారెడ్డిలో 302, నిజామాబాద్‌లో 303, సంగారెడ్డిలో 175 అత్యధికంగా కొవి‌డ్‌ కేసులు నమోదయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.