మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబ‌డిన వారికి క‌రోనా టీకా

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి నివార‌ణ‌కు దేశంలో టీకా పంపిణీ కార్య‌క్ర‌మం వ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో కేంద్రం బుధ‌వారం మ‌రో కీల‌క నిర్ణ‌యంతీసుకుంది. వ‌చ్చే నెల 1 నుంచి క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్‌ను 60 ఏళ్ల పైబ‌డిన వారికి కూడా ఇవ్వ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ బుధ‌వారం వెల్ల‌డించారు. దీర్ఘ కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న‌ 45 ఏళ్ల పైబ‌డిన వారికి కూడా టీకా అందిస్తామ‌ని తెలిపారు. దేశ‌వ్యాప్తంగా 10 వేల ప్ర‌భుత్వ, 20 వేల ప్రైవేటు వ్యాక్సినేష‌న్ సెంటర్ల‌లో వ్యాక్సిన్ వేయ‌నున్న‌ట్లు తెలిపారు. ప్ర‌భుత్వ సెంట‌ర్ల‌లో ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామ‌ని స్పష్టం చేశారు. ప్రైవేటు కేంద్రాల్లో పంపిణీ చేసే వ్యాక్సిన్ల ధ‌ర‌ల‌ను కొద్ది రోజుల్లో నిర్ణ‌యించ‌నున్న‌ట్లు తెలిపారు.

మ‌రో వైపు దేశ‌వ్యాప్తంగా జ‌న‌వ‌రి 16న ప్రారంభ‌మైన క‌రోనా టీకా పంపిణీ కార్య‌క్ర‌మంలో కొన‌సాగుతోంది. ఇవాళ ఉద‌యం 8 గంట‌ల వ‌ర‌కు 1,21,65,598 మందికి వ్యాక్సిన్ అందించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ తెలిపింది.

 

Leave A Reply

Your email address will not be published.