రెండు లారీలు ఢీ.. ముగ్గురు మృతి

అమరావతి: గుంటూరు జిల్లా వినుకొండ మండలం శివాపురం వద్ద గురువారం ఉద‌యం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న మినీ లారీని మ‌రో లారీ ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మినీ లారీ పంక్ఛర్‌ కావడంతో రోడ్డు పక్కన నిలిపి టైర్ పంక్ఛర్‌ వేస్తుండ‌గా.. అటుగా వచ్చిన 12 టైర్ల లారీ.. మినీ లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని మృతదేహలను వినుకొండ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.