స్థిరంగా బంగారం ధర.. కాస్త తగ్గిన వెండి ధరలు
హైదరాబాద్: దిగివస్తున్న బంగారం, వెండి ధరలు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,010 వద్ద ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 45,830 వద్ద ఉన్నది. వెండి ధర మాత్రం కాస్త తగ్గింది. కిలో వెండి ధర రూ. 100 తగ్గి రూ.71,600 కి చేరింది. గత మూడు రోజులుగా ధరలు స్థిరంగా ఉండటంతో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.