TS: నేటి నుంచి తెలంగాణ‌లో విద్యాసంస్థ‌లు బంద్

హైద‌రాబాద్ : క‌రోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ సర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకంది. బుధ‌వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠ‌శాల‌ల‌ను తాత్కాలికంగా మూసివేస్తున్న‌ట్లు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ మేర‌కు ఆమె శాస‌న స‌భ‌లో ప్ర‌క‌ట‌న చేశారు. తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు కాబట్టి స్కూల్స్ మూసి వేయాలని కోరుతున్నారని అందుకే రాష్ట్రంలో కరోనా వ్యాధి అరికట్టడం కోసం రేపటి నుంచి స్కూల్స్ మూసివేస్తున్నామని ప్రకటించారు. వీటికి అనుబంధంగా ఉన్న అన్ని హాస్టల్స్ కూడా మూసివేస్తున్నట్టు ప్రకటించారు. గతంలో మాదిరిగానే ఆన్లైన్ క్లాస్ లు ఉంటాయని ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు. విద్యార్థులు ,తల్లిదండ్రుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసి వేస్తున్నామన్న ఆమె వైద్య కళాశాలలు మినహాయించి మిగతా అన్ని రకాల పాఠశాలలు, కళాశాలలకు వర్తిస్తుందని అన్నారు.

మంత్రి స‌బిత ప్ర‌క‌ట‌న సారాంశం
‌దేశంలో మ‌రో మారు క‌రోనా వ్యాప్తి చెందుతుంది. మ‌న పొరుగు రాష్ర్టాల్లోనూ అదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మ‌న రాష్ర్టంలోని విద్యాసంస్థ‌ల్లోనూ చెదురుముదురుగా క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయి. విద్యాసంస్థ‌ల్లో బోధ‌న‌, బోధ‌నేత‌ర కార్య‌క్ర‌మాలు సామూహికంగా జ‌రుగుతాయి క‌నుక క‌రోనా విస్ఫోట‌కంగా మారే ప్ర‌మాదం ఉంటుంద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇప్ప‌టికే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ర్ట‌, పంజాబ్‌, త‌మిళ‌నాడు, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, గుజ‌రాత్‌తో పాటు త‌దిత‌ర రాష్ర్టాలు విద్యాసంస్థ‌లను మూసివేశాయి. మ‌న రాష్ర్టంలోనూ విద్యార్థుల త‌ల్లిదండ్రుల నుంచి క‌రోనా వ్యాప్తి విష‌యంలో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. విద్యాసంస్థ‌ల‌ను తాత్కాలికంగా మూసివేయాల‌ని వారి నుంచి ప్ర‌భుత్వానికి కూడా విజ్ఞ‌ప్తులు వ‌స్తున్నాయి. ఈ ప‌రిస్థితుల‌ను సంపూర్ణంగా స‌మీక్షించిన త‌ర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని త‌ల్లిదండ్రుల విజ్ఞ‌ప్తి మేర‌కు రాష్ర్టంలో క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌డం కోసం ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థ‌ల‌న్నింటినీ రేప‌ట్నుంచి తాత్కాలికంగా మూసివేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఈ మూసివేత ఆదేశాలు వైద్య క‌ళాశాలలు మిన‌హాయించి.. రాష్ర్టంలోని అన్ని హాస్ట‌ళ్లు, గురుకుల విద్యాల‌యాలు, ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు విద్యాసంస్థ‌ల‌న్నింటికీ వ‌ర్తిస్తాయి. గ‌తంలో నిర్వ‌హించిన మాదిరిగానే ఆన్‌లైన్ క్లాసులు య‌థాత‌థంగా కొన‌సాగుతాయి. ప్ర‌భుత్వం క‌రోనా క‌ట్ట‌డికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌కు రాష్ర్ట ప్ర‌జ‌లంద‌రూ స‌హ‌క‌రించాల‌ని, విధిగా మాస్కులు ధ‌రించాల‌ని, భౌతిక దూరం పాటించాల‌ని, శానిటైజేష‌న్ త‌దిత‌ర జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్న‌ట్లు మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ప్ర‌క‌ట‌న చేశారు.

Leave A Reply

Your email address will not be published.