విషాదం: ఎన్ఆర్ఐ కుటుంబం అనుమానాస్పద మృతి
విశాఖ: విశాఖపట్నంలోని మధురవాడ మిథిలాపురికాలనీలోని ఓ అపార్ట్‌మెంటులో ఎన్ఆర్ఐ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెండం కలకలం రేపింది. ఆదిత్య ఫార్చూన్ టవర్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఆదిత్య ఫార్చూన్ టవర్ లోని ప్లాట్ నెంబర్ 505లో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు.
విజయనగరం జిల్లా గంట్యాడకు చెందిన ఎన్ఆర్ఐ కుటుంబం 8 నెలల కిందట అపార్ట్‌మెంట్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. మృతులు బంగారునాయుడు (50), నిర్మల (46), దీపక్ (22), కశ్యప్(19) లుగా గుర్తించారు. అయితే, ఘటనా స్థలంలో రక్తపు మరకలు ఉండటంతో స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్యచేసి ప్రమాదంగా చిత్రీకరించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.